ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. శాంతి, భద్రతలు కాపాడే అధికారి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ నిరసనలు తెలుపుతున్న ఉద్యమకారులపై ఆయన లాఠీ ఎత్తలేదు, మెడ పట్టి ఈడ్చుకెళ్లలేదు. ఆయనే ఓ ఉద్యమకారుడు అయ్యాడు. తెలుగుజాతిని ఐక్యంగా ఉంచాలంటూ యోగి వేమన వేషధారణలో ఆయన నిరసన తెలుపుతున్నాడు. సమైక్య వేమనను చూడాలంటే మనం తూర్పు గోదావరి జిల్లా వెళ్లాల్సిందే. రాజమండ్రి అర్బన్ పరిధిలో విధులు సర్కిల్ ఇన్‌స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న యార్లగడ్డ జగదీశ్వరరావు వేమన అవతారంతో నిరసన చేపట్టారు. యోగి వేమన విగ్రహం ఎదుట అచ్చం వేమనలానే కూర్చుని నిరసన తెలిపారు. కడియం మండలం వేమగిరి కొండపై బుద్ధ విహార్ తెలుగు పందిరిలో వేమన విగ్రహం దగ్గర ఆయన వేషధారణలోనే ధ్యానం చేస్తున్నారు. ఇంతటితో ఆగలేదు ఈ అభినవ వేమన. సమైక్య ఉద్యమంలో పాల్గొంటూ ప్రసంగాలు కూడా చేస్తున్నారు. రక్తదానం చేశారు. డిసెంబర్ 9 ప్రకటన చిదంబరం ప్రకటన సమయంలో జగదీశ్వరరావు మండపేట రూరల్ ఎస్‌ఐగా ఉన్నారు. రాష్ట్ర విభజన చేస్తే ప్రాణత్యాగం చేస్తానని అప్పట్లోనే ప్రకటించారు. దీంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తిరిగి 2010లో విధుల్లో చేరిన జగదీశ్వరరావు సీఐగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం రాజమండ్రి సీఐగా జగదీశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్న మాదిరిగానే సమైక్యాంధ్ర విషయంలో సీమాంధ్ర నేతల మాటలు ఉన్నాయంటారు ఈ అభినవ వేమన.
Published Sun, Nov 3 2013 3:15 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement