కూలీ నెంబర్1 | Bhumana Karunakar Railway Coolie getup for Samaikyandhra in Tirupati | Sakshi
Sakshi News home page

కూలీ నెంబర్1

Published Sun, Sep 29 2013 3:36 PM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

Bhumana Karunakar Railway Coolie getup for Samaikyandhra in Tirupati

ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి దూసుకుపోతున్నారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న పోరాటంలో దుమ్ము రేపుతున్నారు. ఉద్యమకారులతో కలిసి తన నియోజకవర్గంలో సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రజల్లో ఒకడిగా కలిసిపోయి ఆందోళనలు సాగిస్తున్నారు. విభిన్న వేషధారణలు, వైవిధ్య అంశాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో గత రెండు నెలలుగా మహోగ్రంగా జరుగుతున్న సమైక్య ఉద్యమంలో భూమన తనదైన ముద్ర వేయగలిగారు.

బూట్‌ పాలిష్‌ చేయడం, బుట్టలు అల్లడం, రిక్షా తొక్కడం, లాగేజీ మోయడం.. ఇవన్నీ చేసింది ఒక్కరే. ఆయనెవరో కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయిన నాటి నుంచి విభిన్న నిరసన ప్రదర్శనలతో ఆయన సమైక్య పోరాటం చేస్తున్నారు. రాష్ట్రాన్ని చీల్చడానికి జరుగుతున్న కుట్రలను చీల్చచెండాడుతున్నారు. ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, నిరాహారదీక్షల్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

సమైక్య ఉద్యమంలో భాగంగా భూమన కరుణాకర రెడ్డి శనివారంనాడు (సెప్టెంబర్ 28న) రైల్వే కూలి అవతారమెత్తారు. తిరుపతి రైల్వేస్టేషన్లో కూలిపని చేసి నిరసన తెలిపారు. అంతకుముందు కూడా భిన్న వేషధారణలతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నెల 24న పశువుల కాపరి వేషంలో పశువులను కాస్తూ రాష్ట్ర విభజనకు నిరసన తెలియజేశారు. 19న తిరుపతిలోని తుడా సర్కిల్లో క్రిస్టియన్ మైనార్టీల దీక్షలో  నడిరోడ్డుపై బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. 16న బూట్‌ పాలిష్‌ చేశారు. 11న మట్టి కుండలను ఎత్తుకుని నిరసన వ్యక్తం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన నాటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటానికి భూమన కేరాఫ్ అడ్రస్గా మారారు. తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఆయన ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించిన తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకుంటూ భూమన తన నియోజకవర్గ ప్రజలతో శెభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ తనశైలిలో ముందుకు సాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement