Railway Coolie
-
కావాలంటే ఓ పదిరూపాయలు ఎక్కువ అడుగు... ఓటు మాత్రం అడగొద్దు
కావాలంటే ఓ పదిరూపాయలు ఎక్కువ అడుగు... ఓటు మాత్రం అడగొద్దు -
Ch Nageshu Patro: ఈయనో మూన్‌లైటింగ్ కూలీ
బరంపూర్: మూన్‌లైటింగ్. ఐటీ రంగంలో ఈ మధ్య బాగా పాపులరైన పదం. రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. ఒడిశాకి చెందిన ఒక లెక్చరర్ కూడా మూన్‌లైటింగ్ చేస్తున్నారు. కానీ ఈయనది మనసుని కదిలించే కథ. పొద్దున్న పూట కాలేజీలో విద్యార్థులకు పాఠాలు. రాత్రయ్యే సరికి ఎర్రచొక్కా వేసుకొని రైల్వే స్టేషన్లలో కూలీ అవతారం. డబ్బు సంపాదించడం కోసం కాకుండా, తాను ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో పని చేసే వారికి జీతాలు ఇవ్వడం కోసం కూలీ పని చేస్తున్నారు. ఒడిశాలో గంజామ్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల సీహెచ్.నగేశు పాత్రో బరంపూర్ రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసేవారు. కరోనా సమయంలో రైళ్లు నిలిచిపోవడంతో ఆయనకు పని లేకుండా పోయింది. ఎంఏ వరకు చదువుకున్న పాత్రో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నిరుపేద విద్యార్థుల కోసం ఒక కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పదో క్లాసు పిల్లలకి పాఠాలు చెప్పసాగారు. కోచింగ్ సెంటర్‌కి ఆదరణ పెరగడంతో 10 నుంచి 12 వేల జీతానికి కొందరు టీచర్లను నియమించారు. వారికి జీత భత్యాలు ఇవ్వడానికి రాత్రయ్యే సరికి మళ్లీ కూలీ పని చేస్తున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు పాత్రో సూరత్‌లోని ఒక మిల్లులో, హైదరాబాద్‌లోని ఒక మాల్లో పని చేసి తాను సంపాదించిన డబ్బులతోనే చదువుకున్నారు. -
ఫ్రీ వైఫై.. జీవితాన్ని మలుపు తిప్పింది
తిరువనంతపురం: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తమ చుట్టూ పుస్తకాలు వేసుకుని గంటల తరబడి కుస్తీ పట్టడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఓ యువకుడు ఫ్రీ వైఫై సాయంతో తన తలరాతను మార్చుకున్నాడు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల రాత పరీక్షలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన ఓ రైల్వే కూలీ స్టోరీ ఇది. మున్నార్‌కు చెందిన శ్రీనాథ్ పదో తరగతి పాసయ్యాడు. కుటుంబ ఆర్థిక స్తోమత అంతగా లేకపోవటంతో చదువుకు స్వస్తి చెప్పి ఐదేళ్ల క్రితం ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో కూలీగా పనిలో చేరాడు. ఓవైపు కుటుంబానికి సాయంగా ఉంటూనే.. మరోపక్క ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని భావించాడు. అయితే అందుకు అవసరమైన మెటీరియల్ కొనుక్కునేందుకు అతని దగ్గర డబ్బులేదు. అయినప్పటికీ ఎలాగోలా కష్టపడి రెండుసార్లు పరీక్షలు రాశాడు. అలాంటి సమయంలోనే రైల్వే స్టేషన్లో ప్రవేశపెట్టిన ఫ్రీ వైఫై అతని జీవితాన్ని మలుపు తిప్పింది. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను వైఫై వాడటాన్ని గమనించిన శ్రీనాథ్‌కు ఓ ఆలోచన తట్టింది. బంధువుల దగ్గర అప్పు చేసి ఓ స్మార్ట్ ఫోన్ కొనుకున్నాడు. దాని ద్వారానే పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుకోవటం ప్రారంభించాడు. ఓవైపు లగేజీ మోస్తూనే.. మరోవైపు ఇయర్ ఫోన్స్ ద్వారా ఫోన్లో ఆడియో పాఠాలు విన్నాడు. తెలిసిన కొందరు లెక్చరర్ల సాయంతో ఫోన్ కాల్ ద్వారా పాఠాలు చెప్పించుకున్నాడు. రాత్రిపూట ఆ పాఠాలను రివిజన్ వేసుకుంటూ కష్టపడ్డాడు. చివరకు ఈ మధ్యే కేపీఎస్సీ, విలేజ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించాడు. త్వరలోనే శ్రీనాథ్ ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్నాడు. అందులో విజయం సాధిస్తే అతని కష్టాలు తీరినట్లే. ‘పరిస్థితులను మనకు అనుకూలంగా మల్చుకుంటే ఎతంటి కష్టానైనా అధిగమించొచ్చు’ అని శ్రీనాథ్ చెబుతున్నాడు. -
కూలీ నెంబర్1
ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి దూసుకుపోతున్నారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న పోరాటంలో దుమ్ము రేపుతున్నారు. ఉద్యమకారులతో కలిసి తన నియోజకవర్గంలో సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రజల్లో ఒకడిగా కలిసిపోయి ఆందోళనలు సాగిస్తున్నారు. విభిన్న వేషధారణలు, వైవిధ్య అంశాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో గత రెండు నెలలుగా మహోగ్రంగా జరుగుతున్న సమైక్య ఉద్యమంలో భూమన తనదైన ముద్ర వేయగలిగారు. బూట్ పాలిష్ చేయడం, బుట్టలు అల్లడం, రిక్షా తొక్కడం, లాగేజీ మోయడం.. ఇవన్నీ చేసింది ఒక్కరే. ఆయనెవరో కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయిన నాటి నుంచి విభిన్న నిరసన ప్రదర్శనలతో ఆయన సమైక్య పోరాటం చేస్తున్నారు. రాష్ట్రాన్ని చీల్చడానికి జరుగుతున్న కుట్రలను చీల్చచెండాడుతున్నారు. ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, నిరాహారదీక్షల్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా భూమన కరుణాకర రెడ్డి శనివారంనాడు (సెప్టెంబర్ 28న) రైల్వే కూలి అవతారమెత్తారు. తిరుపతి రైల్వేస్టేషన్లో కూలిపని చేసి నిరసన తెలిపారు. అంతకుముందు కూడా భిన్న వేషధారణలతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నెల 24న పశువుల కాపరి వేషంలో పశువులను కాస్తూ రాష్ట్ర విభజనకు నిరసన తెలియజేశారు. 19న తిరుపతిలోని తుడా సర్కిల్లో క్రిస్టియన్ మైనార్టీల దీక్షలో నడిరోడ్డుపై బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. 16న బూట్ పాలిష్ చేశారు. 11న మట్టి కుండలను ఎత్తుకుని నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన నాటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటానికి భూమన కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఆయన ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించిన తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకుంటూ భూమన తన నియోజకవర్గ ప్రజలతో శెభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ తనశైలిలో ముందుకు సాగుతున్నారు.