బొత్స ఇంజనీరింగ్ కాలేజీపై దాడి | Samaikyandhra Protesters Attack on Botsa Satyanarayana Engineering College | Sakshi
Sakshi News home page

బొత్స ఇంజనీరింగ్ కాలేజీపై దాడి

Published Sun, Oct 6 2013 11:29 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

బొత్స ఇంజనీరింగ్ కాలేజీపై దాడి - Sakshi

బొత్స ఇంజనీరింగ్ కాలేజీపై దాడి

విజయనగరంలో కర్ఫ్యూ విధించినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమకారులు పోరు కొనసాగిస్తున్నారు. రోడ్డుపై కనిపిస్తే కాల్చిపారేస్తామని పోలీసులు హెచ్చరించినప్పటికీ సమైక్యవాదులు తమ గళం విన్పిస్తూనే ఉన్నారు.

విజయనగరం: విజయనగరంలో కర్ఫ్యూ విధించినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమకారులు పోరు కొనసాగిస్తున్నారు. రోడ్డుపై కనిపిస్తే కాల్చిపారేస్తామని పోలీసులు హెచ్చరించినప్పటికీ సమైక్యవాదులు తమ గళం విన్పిస్తూనే ఉన్నారు.  ఉద్యమకారులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఎక్కడికక్కడ ఉద్యమకారులను అడ్డుకుంటున్నారు. రోడ్లపై కనిపించినవారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అని కూడా చూడకుండా చితకబాదుతున్నారు.

బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. గాజుల రేగలో బొత్స ఇంజనీరింగ్ కాలేజీపై సమైక్యావాదుల దాడి చేశారు. దీంతో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది స్థానికుల ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేశారు. దొరికిన వారిని దొరికిట్టు విచక్షణ చావబాదారు. కొత్తపేట వాటర్ ట్యాంకు వద్ద సమైక్యవాదులపై పోలీసులు లాఠీచార్జీ చేసి, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని డీఐజీ ఉమాపతి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement