
కేంద్రానికి సీఎం కిరణ్ కోవర్టు: శ్రీకాంత్‌రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా: సమైక్యవాది ముసుగులో సీఎం కిరణ్ దొంగాటాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రానికి సీఎం కిరణ్ కోవర్టుగా పనిచేస్తూ సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఆరోపించారు. తుపాన్ పేరుతో విద్యుత్ ఉద్యోగులను ఉద్యమానికి సీఎం కిరణ్ దూరం చేశారన్నారు.
సరైన హామీ ఇవ్వకుండానే ఆర్టీసీ కార్మికులను ఉద్యమాన్ని బొత్స సత్యనారాయణ నీరు కార్చారని అన్నారు. సీఎం కిరణ్ నిజంగా సమైక్యవాది అయితే సమైక్య శంఖారావం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 19న సభకు అనుమతిస్తే లక్షల మంది సమైక్యవాదాన్ని దేశానికి వినిపించే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచంలో ఏ కారణం లేకుండా ఆమరణ దీక్ష చేసిన ఘనత చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. విజనను వేగవంతం చేసేందుకే చంద్రబాబు దీక్ష చేశారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.