
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నారాయణ వచ్చాక కమ్యూనిస్ట్ పార్టీ భ్రష్టు పట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కమ్యూనిస్ట్ పార్టీ క్యాపటలిస్ట్ పార్టీగా మారిపోయిందన్నారు. పవన్‌కల్యాణది నిమిషానికో మాట.. పూటకో తీరు అంటూ ఆయన దుయ్యబట్టారు.
చదవండి: రాజకీయ లబ్ధికే పవన్ పాకులాట
జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎక్కడ లోపం జరిగిందో చెబితే సరిదిద్దుకునే నైజం జగన్‌ది. పవన్ అవి అడగకపోగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే పార్టీ టీడీపీ. ప్రజలతో మమేకం అవటంమే మా లక్ష్యం. అడ్డమైన విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు మానుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment