
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడో అతనికే తెలియదని ఎద్దేవా చేశారు. గతంలో సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయవాడకు మకాం మార్చాలన్నా వినలేదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తంతే చంద్రబాబు విజయవాడలో పడ్డారని వ్యాఖ్యానించారు.(సీఎం జగన్ పాలనపై ఛార్జిషీట్ వేయటం హాస్యాస్పదం)
రాజధానికి నాలుగైదు వేల ఎకరాలు చాలన్నా చంద్రబాబు పట్టించుకోలేదని నారాయణ మండిపడ్డారు. బాబు అత్యాశకు పోయి అమరావతిని సక్సెస్ చేయడంలో విఫలమయ్యాడని తీవ్రంగా విమర్శించారు. లక్షల కుటుంబాలకు చంద్రబాబు సహాయం చేశానని చెబుతున్నారని.. పార్టీ అంపశయ్యపై ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చారా అని నారాయణ ప్రశ్నించారు. (పార్టీ మారేందుకు సీనియర్లు చర్చలు: బలరాం)
Comments
Please login to add a commentAdd a comment