
ఫైల్ ఫోటో
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తప్పుపట్టారు. సీపీఐ నేత నారాయణ తనకు మంచి మిత్రుడని, కానీ ఆయన చంద్రబాబు నాయుడుకి లొంగిపోయి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీపీఐ పార్టీనీ చంద్రబాబుకు ఎప్పుడో అమ్మేశారని ఆరోపించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. పేదలకు ఇస్తున్న స్థలం కుక్కల దొడ్డి అంత లేదనడం నారాయణ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇళ్ల స్థలం తీసుకున్న పేదల దగ్గరకు వెళ్లి నారాయణ ఆ మాటలు అనాలని సవాల్ విసిరారు. పేదల సంతృప్తే తమ ప్రభుత్వానికి ముఖ్యమని తెలిపారు. లోకేష్ మాటలకు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీకి బేస్‌మెంట్ కదిలిపోయిందని, ఆ పార్టీని కాపాడుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment