
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి కడప జిల్లా పరువు తీస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి కడప జిల్లా పరువు తీస్తున్నాడని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లో మీడియాలో ప్రచారం కోసం ఆదినారాయణ ఇష్టానుసారంగా మాట్లాడటం బాధాకరమన్నారు.
‘‘పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతి పేరిట యాత్ర చేయించారు. హైకోర్టు ఆధార్ కార్డులు అడిగితే యాత్ర ఎత్తేశారు. ప్రతి కుటుంబానికి మేలు జరగాలని ప్రభుత్వం పరితపిస్తోంది. సీఎం జగన్ ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేక దూషణలకు దిగుతున్నారు. ఆదినారాయణరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
చదవండి: ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్ డైరీలో ఏముంది?