సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దేశ రాజధాని ఢిల్లీకి కూడా విస్తరింపజేయూలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నిర్ణయించింది.
* సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దేశ రాజధాని ఢిల్లీకి కూడా విస్తరింపజేయూలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమైక్య సెగ తాకేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల నిర్వహణకు ఉద్యోగులు నిర్ణయించారు. ఉద్యోగులందరూ భారీ సంఖ్యలో ఢిల్లీ చేరుకుని, రెండు మూడు రోజులు ఆందోళనలు, ధర్నాలు భారీ స్థాయిలో చేపట్టాలని ఫోరం వుంగళవారం సచివాలయుం డీ బ్లాక్‌లో జరిగిన సర్వసభ్య సమావేశం తీర్మానించింది.
సచివాలయంలో ఇకపై వినూత్న రీతుల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఫోరం కన్వీనర్ యు. మురళీకృష్ణ, కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. ఢిల్లీలో జరపబోయే ఆందోళనపై కార్యచరణను రూపొందిస్తున్నామన్నారు. మరోవైపు,.. సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు మద్దతుగా సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు సమ్మె వుంగళవారమూ కొనసాగింది. పెద్దసంఖ్యలో ఉద్యోగు లు నిరసనలో పాల్గొన్నారు. బుధవారం తో సమ్మె 9వ రోజుకు చేరుకుంటోంది.