సమైక్యాంధ్ర నయవంచకుడు సీఎం కిరణ్: వాసిరెడ్డి పద్మ
సమైక్యాంధ్ర నయవంచకుడు సీఎం కిరణ్: వాసిరెడ్డి పద్మ
Published Thu, Oct 17 2013 6:51 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సమైక్యాంధ్ర నయవంచకుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆరు కోట్ల సీమాంధ్రులను బలి పశువును చేశారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కిరణ్ సోనియా గాంధీ కోవర్టు అని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్టు పొడిచిన విభజనవాది సీఎం కిరణ్ అని అన్నారు. సీఎంను చరిత్ర క్షమించదు అని అన్నారు.
సీఎం కిరణ్ చేసిన ద్రోహాన్ని సీమాంధ్రులు ఎన్నడూ మరిచిపోరు అని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీఎం కిరణే నీరు గారుస్తున్నారు అని అన్నారు. మాయ మాటలు చెప్పి ఉద్యమాన్ని ఉద్యోగులకు నుంచి సీఎం తప్పిస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడుతారని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement