రాష్ట్ర సమైక్యత కోసం అయిదు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది.
హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసం అయిదు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు కొద్దిసేపటి క్రితం జగన్కు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఆరోగ్యం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా జగన్ దీక్ష విరమించి వైద్యసేవలు పొందడానికి సహకరించాలని వారు కోరుతున్నారు. మరిన్ని వైద్యపరీక్షలు నిర్వహించడానికి వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.