హైదరాబాద్ : సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని మంత్రి పార్థసారధి అన్నారు. అయితే కొన్ని పార్టీలు ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం ఉదయం ఓ ఛానల్ కార్యక్రమంలో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ సీమాంధ్రలో ఉద్యమాల వల్ల విద్యార్థుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందన్నారు.
పాఠశాలలు తెరిపించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ పచ్చి అవకాశవాద పార్టీలని పార్థసారధి విమర్శించారు. చంద్రబాబునాయుడు తన యాత్రలో ఏం చెపుతున్నారో ఆయనకే తెలియటం లేదని ఆయన అన్నారు.