డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ? | Kirankumar Reddy may launch new Political party in December | Sakshi
Sakshi News home page

డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ?

Published Fri, Oct 11 2013 9:55 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ? - Sakshi

డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ?

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సొంతపార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించినట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్త ప్రచురించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కట్టుబడితే కాంగ్రెస్ను వీడాలని కిరణ్ భావిస్తున్నారు(ట). అయితే రాష్ట్ర విభజనను అడ్డుకునే శక్తి తనకింకా ఉందని సీఎం నమ్ముతున్నారు.

సీమాంధ్రకు మద్దతుగా డిసెంబర్లో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. నూతన పార్టీ స్థాపనకు మద్దతు కూడకట్టేందుకు ఇప్పటికే ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానం ఓడించి, రాష్ట్రపతిని కలిసిన తర్వాత సొంతకుంపటి ప్రారంభించేందుకు  సీఎం సన్నద్ధమవుతున్నారని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ను వదిలిపెట్టాలనుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలను తన పార్టీ కోసమే అసెంబ్లీ తీర్మానం పేరుతో కిరణ్ కట్టడి చేశారన్న వాదన విన్పిస్తోంది.

సమైక్యాంధ్ర ఎజెండాతో పార్టీ పెట్టి సీమాంధ్రలో మద్దతు కూడగట్టాలన్నది కిరణ్ వ్యూహంగా కనబడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు ఉద్యోగ సంఘాల నాయకులను కిరణ్ తనవైపు తిప్పుకున్నట్టు తెలుస్తోంది. సమైక్య ఉద్యమ వేడి తగ్గకుండా చూసేందుకు కిరణ్తో అంగీకారానికి వచ్చారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగుల సమ్మె విరమించినా ఉద్యమం సెగ చల్లారకుండా చూడాలని వీరు భావిస్తున్నారు(ట).

రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల రాజకీయ జీవితం ప్రమాదంలో పరిస్థితి తలెత్తింది. కనీసం 50 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరు కొత్త పార్టీవైపు చూస్తున్నారు. ఇలాంటి నాయకులు కిరణ్ పెట్టబోయే పార్టీలోకి వస్తారని అంచనా వేస్తున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. పథకం ప్రకారమే కొత్త పార్టీ దిశగా కిరణ్ అడుగులు వేస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement