ఈనెల 19న హైదరాబాద్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని గుర్తు చేశారు. గతంలో సమైక్యవాదుల సభలకు, తెలంగాణవాదుల సభలకు అనుమతిచ్చారు కదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ సమైక్య సభకు అనుమతిపై పోలీసులు నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని రాఘవులు సూచించారు. ఎవరి భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరకీ లేదన్నారు. సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న తమకు మద్దతు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు సీపీఎం నేతలను కోరారు. తాము మొదట్నించీ సమైక్యవాదులమేనని, తమ పూర్తి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులకు హామీ ఇచ్చారు.
Published Mon, Oct 14 2013 5:55 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement