కూర్చుంటే రూ.157.. నిల్చుంటే 100..
రాజమండ్రి సిటీ / రైల్వే స్టేషన్: యాత్రికుల రద్దీని అనుసరించి ఆర్టీసీ అధికారులు పుష్కర భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాజమండ్రి డిపో నుంచి విశాఖ వైపు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయలేక చేతులెత్తేసిన అధికారులు వినూత్న ప్రయోగం చేశారు. విశాఖపట్నం వరకూ బస్ టికెట్ రూ. 157 వసూలు చేస్తుండగా నిలబడి వెళ్లే ప్రయాణికులకు ధర రూ.వందగా ప్రకటిస్తూ ఫ్లెక్సీలు ఆర్టీసీ డిపో ఆవరణలో అప్పటికప్పడు ఏర్పాటు చేశారు. దీనిని చూసిన ప్రయాణికులు ఇదేం విడ్డూరం అంటూ విస్తుపోయారు.