స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం | shivaiah helps to friensd ramakrishna to do pushkara bath | Sakshi
Sakshi News home page

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

Published Fri, Jul 17 2015 10:57 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం - Sakshi

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : రెండు కాళ్లూ చచ్చుబడిపోయిన స్నేహితుడిని పుష్కరస్నానం చేయించేందుకు వీపుపై మోసుకుని ఘాట్ వద్దకు వచ్చాడు ఓ స్నేహితుడు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన రామకృష్ణ, శివయ్య చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వీరిలో రామకృష్ణ వికలాంగుడు. వారిద్దరూ పుష్కరస్నానం కోసం బస్సులో రాజమండ్రి వచ్చారు.

అనంతరం వీఐపీ ఘాట్ వరకు రామకృష్ణను మిత్రుడు శివయ్య తన వీపుపై మోసుకుంటూ వచ్చి పుష్కరస్నానం చేయించాడు. స్నేహితుని పుష్కర స్నానానికి అన్నివిధాల సహకరించి, మిత్రుడు రామకృష్ణ పుణ్యస్నాన కోరికను తీర్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement