స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : రెండు కాళ్లూ చచ్చుబడిపోయిన స్నేహితుడిని పుష్కరస్నానం చేయించేందుకు వీపుపై మోసుకుని ఘాట్ వద్దకు వచ్చాడు ఓ స్నేహితుడు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన రామకృష్ణ, శివయ్య చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వీరిలో రామకృష్ణ వికలాంగుడు. వారిద్దరూ పుష్కరస్నానం కోసం బస్సులో రాజమండ్రి వచ్చారు.
అనంతరం వీఐపీ ఘాట్ వరకు రామకృష్ణను మిత్రుడు శివయ్య తన వీపుపై మోసుకుంటూ వచ్చి పుష్కరస్నానం చేయించాడు. స్నేహితుని పుష్కర స్నానానికి అన్నివిధాల సహకరించి, మిత్రుడు రామకృష్ణ పుణ్యస్నాన కోరికను తీర్చాడు.