
కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, రాజమండ్రి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైసా కూడా బాకీ లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం రాష్ట్రానికి సంబంధం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేవలం సమన్వయకర్త మాత్రమేనని కన్నా అన్నారు. పోలవరాన్ని కేంద్రం గడువులోగా నిర్మించి తీరుతుందని ఆయన చెప్పారు.
అంతేకాక కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటని బీజేపీ నేత ప్రశ్నించారు. నిజాలు చెప్తున్నామనే మా పై దాడులు చేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు గుండె లాంటిది.. అలాంటిది రాజకీయాల కోసం గుండెను పిసికేయవద్దని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment