వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : పుష్కర ఘాట్‌లో చోటు చేసుకున్న దుర్ఘటనతో వీఐపీ ఘాట్‌లో సాధారణ యాత్రికులకు కూడా అనుమతిస్తున్నారు. కానీ అధికారులు వీఐపీ కోణంలో బందోబస్తు చేయడంతో ఇబ్బందులు ఎదురౌతున్నా యి. వీఐపీ ఘాట్ నాలుగు విభాగాలుగా ఉంది. వీఐపీలు వచ్చే సమయంలో మైకుల్లో ఘాట్‌లో ఉన్న యాత్రికులను స్నానాలు ముగించుకుని త్వరగా రావాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. తొందరగా స్నానాలు ముగించే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఘాట్‌లో కేవలం వీఐపీల కోసం ఒక విభాగాన్ని పూర్తిగా కేటాయించి, మిగిలిన మూడు విభాగాలను సాధారణ యాత్రికులకు కేటాయిస్తే మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.