కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి | Youth Attack On Constable With Knife At Rajahmundry | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

Published Fri, Nov 22 2019 9:32 AM | Last Updated on Fri, Nov 22 2019 11:07 AM

Youth Attack On Constable With Knife At Rajahmundry - Sakshi

సాక్షి, రాజమండ్రి: స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌పై యువకులు దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సంచలన సృష్టించింది. సీతానగరం, కోరుకొండ పోలీస్‌ స్టేషన్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు గురువారం మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ఆనంద్‌ నగర్‌ ఆటో స్టాండ్‌ వద్దకు వచ్చేసరికి వెనుక వైపు నుంచి మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గరు యువకులు అతడి మైటారు సైకిల్‌ను ఢీ కొట్టారు. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆ యువకుల మోటార్‌ సైకిల్‌ నంబర్‌ను సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తుండగా వారు అతనితో ఘర్షణకు దిగారు.

అంతటితో ఆగకుండా  యువకులు కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. కత్తులతో వీరంగా సృష్టించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం తనపై దాడి జరిగినట్టుగా కానిస్టేబుల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో త్రీటౌన్‌​ పోలీసులు అక్కడికి చేరకుని ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన యువకులు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారందరినీ అరెస్ట్‌ చేస్తామని ఎస్‌ఐ దుర్గా ప్రసాద్‌ తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ కానిస్టేబుల్‌కు చికిత్స అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement