ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తూర్పుగోదావరి: మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితులను అరెస్టు చేశామని రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పేయ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో 13 మందిని నిందితులుగా గుర్తించామని అందులో 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఉద్యోగం పేరుతో మైనర్ బాలికను అనిత అనే యువతి ట్రాప్ చేసిందని ఎస్పీ పేర్కొన్నారు. (చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం)
నిందితులపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నిందితులలో నలుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారని తెలిపారు. నిందితులలో ఒకరే మైనర్ కాగా నిందితులకు కరోనా పాజిటీవ్ ఉన్నట్లు వెల్లడించారు. అమ్మాయిలను నమ్మి ఎవరితోనూ పంపవద్దని తల్లిద్రండ్రులకు సూచించారు. ఇక కోరుకొండ పోలీసు స్టేషన్ కేసు నమోదు చేయలేదనే ఆరోపణలపై విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. (చదవండి: వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment