వెలగనీకుమా ఈ దీపం...
కోటిలింగాలఘాట్ (రాజమండ్రి) : దీపం ఆర్పడం అమంగళమని అంతా భావిస్తారు. కానీ పుష్కర ఘాట్లలో మాత్రం దీపాలు ఆర్పడం కూడా సేవే అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాలఘాట్ లో ఈ దీపాలు ఆర్పడం మనం గమనించవచ్చు. వాలంటీర్లు చేస్తున్న ఈ పని ఖచ్చితంగా సేవే అవుతోంది. ఎలా అంటే, పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు గోదావరిలో వదిలేందుకు దీపాలు వెలిగించి ఘాట్ల మెట్లపై విడిచి పెడుతున్నారు. వీటివల్ల రద్దీ ఘాట్ల మెట్లపై రాకపోకలు సాగించే భక్తులు ప్రమాదాలకు గురవుతున్నారు. పుష్కర ఘాట్ల వద్ద వాలంటీర్లు ఈ విషయాన్ని గుర్తించి భక్తులు వెలిగించి వదిలేసిన దీపాలను ఆర్పి తొలగిస్తున్నారు. ఈ విధంగా పరోక్షంగా ప్రమాదాలను నివారిస్తున్నారు.