రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. భువనగిరి పట్టణంలోని కుమ్మరి బస్తీకి చెందిన తాడూరు యాదగిరి (58) బుధవారం ఉదయం తన వ్యవసాయ భావి వద్దకు వెళుతున్నాడు. ఈ క్రమంలో బావి వద్ద ఉన్న బైపాస్ రోడ్డును దాటుతుండగా... ఇండియన్ ఆయిల్ లారీ ఢీ కొట్టింది. దాంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసునకుని దర్యాప్తు చేస్తున్నారు.