పేదల బియ్యం పట్టివేత
బనగానపల్లె టౌన్ : పేదల బియ్యూన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారుల బృందం దాడులు చేసింది. బియ్యూన్ని తరలిస్తున్న లారీ సహా వాటి ముందు పెలైట్‌గా బయలుదేరిన కారును అధికారులు సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.4.50 లక్షలు విలువ చేసే మొత్తం 170 క్వింటాళ్ల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ విల్సన్ కథనం ప్రకారం... దొరికిందిలా...
డోన్ సమీపంలోని చిగురుమాను వద్ద బుధవారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయూనికి వచ్చిన లారీని ఆపి తనిఖీ చేశారు. డ్రైవర్‌ను ఆరా తీయగా...అవి రేషన్ బియ్యం అని తెలిపాడు. బనగానపల్లెలోని యోగిశ్వర రైస్ మిల్ యూజమానికి చెందిన లారీగా గుర్తించారు. అందులోని బియ్యం బస్తాలన్నీ అక్రమంగా నల్లబజారుకు తరలిస్తున్నట్లు పసిగట్టారు. లారీ సహా సరుకును సీజ్ చేశారు.
ఇండికా కారు కూడా...
లారీకి ముందు అధికారుల కదలికలను గుర్తిస్తూ.. అలర్ట్ చేసేందుకు వీలుగా పెలైట్ వాహనంగా కారు బయలుదేరింది. అందులో మహమ్మద్ రఫితుల్లాబేగ్, సునీల్ అనే వ్యక్తులు ఉండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. రేషన్ బియ్యూన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నట్లు సదరు వ్యాపారి అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. వ్యాపారిపై గతంలోనూ రెండు కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ ఏసీ సుబ్బారెడ్డి, ఏజీ జాన్, స్థానిక రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.