విజిలెన్స్‌ వలలో భూగర్భజల ప్రాజెక్టు అధికారి | Vigilance Raid In Odisha Leads To Seizure Of 1.50 Crore In Cash From Officer | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ వలలో భూగర్భజల ప్రాజెక్టు అధికారి

Published Thu, Feb 6 2025 8:17 AM | Last Updated on Thu, Feb 6 2025 10:25 AM

Vigilance Raid In Odisha Leads To Seizure Of 1.50 Crore In Cash From Officer

 రూ. కోటిన్నర నగదు సీజ్‌ 

కొనసాగుతున్న దాడులు  

జయపురం/మల్కన్‌గిరి: (Malkangiri) విజిలెన్స్‌ అధికారుల(Vigilance Raids) వలలో భూగర్భజల (సోయిల్‌ కన్జర్వేషన్‌) విభాగ ప్రాజెక్టు డైరెక్టర్‌ సంతూన్‌ మహాపాత్రో చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో సంతూన్‌ మహాపాత్రో ఇళ్లు, ఆస్తులపై బుధవారం ఉదయం నుంచి కొరాపుట్‌ విజిలెన్స్‌ డివిజన్, జయపురం అధికారులు దాడులు జరుపుతున్నారు. 

విజిలెన్స్‌ ఎస్పీ ప్రసన్న కుమార్‌ ద్వివేదీ ఆదేశం మేరకు విజిలెన్స్‌ డీఎస్పీ డీపీ పాణి నేతృత్వంలో 15 మంది విజిలెన్స్‌ సిబ్బంది మల్కనగిరిలో సోయిల్‌ కన్జర్వేషన్‌ ప్రాజెక్టు కార్యాలయం, జయపురం పవర్‌ హౌస్‌ కాలనీలో అతడి నివాస భవనంతోపాటు తొమ్మిది ప్రాంతాల్లో ఒకేసారి దాడులు కొనసాగించారు. సాయంత్రం వరకూ కోటిన్నర రూపాయలకు పైగా నగదు సీజ్‌ చేసినట్టు సమాచారం. అలాగే అధిక అక్రమ సంపద కనుగొన్నట్లు తెలిసింది. 

ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. అలాగే  మల్కన్‌గిరిలోని భూగర్భజల కార్యాలంలో పని చేస్తున్న సహాయ ఇంజినీర్‌ మోహన్‌ మండాల్, డెటా ఏంట్రీ ఆపరేటర్‌ విశ్వజీత్‌ మండాల్, కాంట్రాక్టబేస్‌ ఉద్యోగి అలియా కుమార్‌ సాహు ఇళ్లలో కూడా విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేశారు. అయితే సంతూన్‌ మహాపాత్రో ఇళ్లలోనే కోటిన్నర రూపాయల నగదు, 350 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్‌ చేశారు. జయపురంలో మూడు అంతస్తుల ఇళ్లు, ఆరు వేల అడుగుల స్థలం, భువనేశ్వర్, జయపురంలో నాలుగు ఖరీదైన ఇళ్లు, భువనేశ్వర్‌ హంసపాల్‌లో 33 అడుగులు స్థలం ఉన్నట్టు గుర్తించారు. బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, రెండు బైక్‌లు, ఓ కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement