కడప హోటల్‌లో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్ అధికారుల బృందం
కడప అర్బన్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, అదనపు ఎస్పీ షేక్ మాసుంబాష ఆదేశాల మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం, కడప నగరపాలక సంస్థ శానిటరీ అధికారులు హోటళ్లపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. కడప నగరంలోని ఐదు హోటళ్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద కేసులు నమోదు చేశారు. ఆయా హోటళ్లకు మొత్తం రూ.1,80,000 జరిమానా విధించారు.
ఈ హోటళ్లలో రాజ్ మయూర గార్డెనియా యాజమాన్యానికి రూ.50,000, మయూర బేకరీకి రూ.60,000, ఆంధ్రరుచులుకు రూ.10,000, స్వప్న బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.40,000, రాయలసీమ స్పైస్‌కు రూ.20,000 జరిమానా విధించారు. ఈ మొ త్తాన్ని ఆయా హోటళ్ల యజమానులు కడప నగర పాలక సంస్థకు చెల్లించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ టి.రెడ్డెప్ప, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.విజయకిషోర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎం.డి షంషీర్‌ఖాన్, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు సంయుక్తంగా పాల్గొన్నారు.
రెస్టారెంట్లకు జరిమానా
ప్రొద్దుటూరు : పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కడప విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి షేక్ మాసుం బాషా, ఆఫీసర్ పూల రామకృష్ణ, సీఐ అశోక్‌కుమార్, ప్రొద్దుటూరు డివిజన్ ఫుడ్ సేప్టీ ఆఫీసర్ హరిత, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కిరణ్, శ్రీనివాసరెడ్డి, గోవిందరెడ్డిలు తనిఖీల్లో పాల్గొన్నారు. పట్టణంలోని సాగర బార్ అండ్ రెస్టారెంట్, ఆంధ్ర కిచెన్, హైదరాబాద్ చెఫ్స్, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్ హోటల్‌లో తనిఖీలు చేశారు.
కిచెన్‌లో పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత పరిమితులను అధికారులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని సాగర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆంధ్రకిచెన్ రెస్టారెంట్‌పై రూ.25 వేలు జరిమానా, హైదరాబాద్ చెఫ్స్ రెస్టారెంట్‌పై రూ.25 వేలు, సిప్ ఇన్ రెస్టారెంట్ అండ్ బార్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరిశీలనకు స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి మాసుం బాషా మా ట్లాడుతూ హోటల్, రెస్టారెంట్ వారు విని యోగదారులకు నాణ్యమైన పదార్థాలు అందించాలని తెలిపారు.
భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో వంటకాలను తయారు చేసి అమ్మాలని చెప్పారు. ఆహార పదార్థాల్లో చైనా సాల్ట్, ఫుడ్ కలర్ ఇతర నిషేధిత పదార్థాలు వాడరాదని, పార్సిల్ విషయంలో ప్లాస్టిక్ కవర్లు వాడరాదని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలపై భారీ ఎత్తున జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమదు చేసి వ్యాపార సంస్థలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment