Poor rice
-
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆటకట్టు
సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్‌ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ టైం మానిటరింగ్ 6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్‌లో మార్కెట్లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ఈ-పాస్ ‘హుష్’
- మంత్రి ఇలాకాలోనే అమలుకాని వైనం అనంతపురం అర్బన్: పేదల బియ్యం నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ-పాస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిం ది. అయితే ఆ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఈ-పాస్ విధానం అమలు అరకొరగా సాగుతోంది. కొం దరు డీలర్లు ఈ పాస్ యంత్రాలను వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. నియోజవకర్గం పరిధిలో ఈ పాస్ అంతంత మాత్రంగా అమలవుతోంది. అనంతపురం రూరల్ మండలం చెందిన పాపంపేట, విద్యారణ్యనగర్, నందమూరినగర్, తారకరామనగర్, గణేశ్‌నగర్, సుందయ్య కాలనీలతో పాటు నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల ఈ పాస్ అమలు కావడం లేదు. ఈ పాస్ యంత్రాలు వచ్చినప్పుడు స్థానిక నాయకులు ప్రారంభించారు. ఒక నెల ఈ-పాస్ విధానంలో సరుకులు పంపిణీ చేసిన డీలర్లు అటు తరువాత వాటిని వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని డీలర్ల వద్ద ప్రస్తావిస్తే... అసలు తమకు ఈ పాస్ యంత్రాలు ఇవ్వలేదని, రాబోయే నెలలో ఇస్తామని అధికారులు అన్నారని వారు చెప్పుకొస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని మేమెందుకు ఈ పాస్ ద్వారా ఇవ్వాలంటూ అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొందరు డీలర్లు ఈ పాస్ యంత్రాలను ఆ శాఖకు వెనక్కి ఇచ్చేసినట్లు తెలిసింది. రెండవ విడతలో మునిసిపాలిటీలకు మొదటి విడతలో మంజూరైన 554 ఈ పాస్ యంత్రాలు మంత్రి ఇలాకాలో ఇచ్చినవి కొన్ని వెనక్కి వచ్చాయి. ఇక రెండవ విడతలో జిల్లాకు 690 ఈ పాస్ యంత్రాలు వచ్చాయి. వీటిని మునిసిపాలిటీల పరిధిలోనూ, కొన్ని ఉరవకొండ, కూడేరు మండలాల పరిధిలోని చౌక దుకాణాలకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లలేదనేది కొసమెరుపు. ఈ- పాస్ యంత్రాలు వెనక్కు ఇస్తే చర్యలు జిల్లాలో తొలి విడత మంజూరైన 594 ఈ- పాస్ యంత్రాలను జిల్లాలోని 63 మండలాలకు కేటాయించాం. వీటిని వెనక్కు ఇవ్వడానికి వీలులేదు. ఎవరైనా వెనక్కు ఇస్తే వారిపై పచర్యలు తప్పవు. రెండవ విడత మంజూరైన 690 యంత్రాలను అన్ని మునిసిపాలిటీల పరిధిలోని దుకాణాల్లో ఏర్పాటు చేశాము. ఉరవకొండ, కూడేరు మండలాల్లో కేవలం ఒకటి రెండు చోట్ల ఉండడంతో ఆ ప్రాంతాలకు కొన్ని కేటాయించాము. - బి.లక్ష్మికాంతం, జాయింట్ కలెక్టర్ -
పేదల బియ్యం పట్టివేత
బనగానపల్లె టౌన్ : పేదల బియ్యూన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారుల బృందం దాడులు చేసింది. బియ్యూన్ని తరలిస్తున్న లారీ సహా వాటి ముందు పెలైట్‌గా బయలుదేరిన కారును అధికారులు సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.4.50 లక్షలు విలువ చేసే మొత్తం 170 క్వింటాళ్ల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ విల్సన్ కథనం ప్రకారం... దొరికిందిలా... డోన్ సమీపంలోని చిగురుమాను వద్ద బుధవారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయూనికి వచ్చిన లారీని ఆపి తనిఖీ చేశారు. డ్రైవర్‌ను ఆరా తీయగా...అవి రేషన్ బియ్యం అని తెలిపాడు. బనగానపల్లెలోని యోగిశ్వర రైస్ మిల్ యూజమానికి చెందిన లారీగా గుర్తించారు. అందులోని బియ్యం బస్తాలన్నీ అక్రమంగా నల్లబజారుకు తరలిస్తున్నట్లు పసిగట్టారు. లారీ సహా సరుకును సీజ్ చేశారు. ఇండికా కారు కూడా... లారీకి ముందు అధికారుల కదలికలను గుర్తిస్తూ.. అలర్ట్ చేసేందుకు వీలుగా పెలైట్ వాహనంగా కారు బయలుదేరింది. అందులో మహమ్మద్ రఫితుల్లాబేగ్, సునీల్ అనే వ్యక్తులు ఉండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. రేషన్ బియ్యూన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నట్లు సదరు వ్యాపారి అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. వ్యాపారిపై గతంలోనూ రెండు కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ ఏసీ సుబ్బారెడ్డి, ఏజీ జాన్, స్థానిక రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.