
బండి మీద బండి.. రైలింజనండీ
రైలు పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్ ఒక్కసారిగా లారీ పైన చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి దృశ్యమే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో గురువారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ రైలింజన్‌ను లారీ ట్రాలీలో రాయిచూర్ వైపు దేవరకద్ర మీదుగా తరలించారు.
దీంతో పట్టాలపై వెళ్లాల్సిన రైలింజన్ లారీ ట్రాలీపై వెళ్తుండడంతో ఈ దృశ్యాన్ని గ్రామస్తులు, ప్రయాణికులు
ఎంతో ఆసక్తిగా గమనించారు. ఆ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
- దేవరకద్ర రూరల్