రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఈ ఘనట చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో బుధవారం జరిగింది. రోడ్డు దాటడానికి ప్రయత్నించిన గుర్తుతెలియని (20) యువకుడిని లారీ ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు లారీని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.