
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
శుక్రవారం తెల్లవారు జామున శ్రీరంగపట్టణం-బీదర్ రాష్ట్ర ప్రధాన రహదారిలో రెండు లారీల ఢీకొన్నరోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.
- రెండు లారీలు ఢీ
చెళ్లకెర రూరల్ : శుక్రవారం తెల్లవారు జామున శ్రీరంగపట్టణం-బీదర్ రాష్ట్ర ప్రధాన రహదారిలో రెండు లారీల ఢీకొన్నరోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. ప్లాస్టిక్ సంచులను నింపుకుని చెళ్లకెర నుంచి బళ్లారి వైపు వెళుతున్న లారీ, బళ్లారి నుంచి హిరియూరు వైపు వస్తున్న బియ్యం లోడ్ లారీ ఎదురెదురుగా అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద తీవ్రతకు ప్లాస్టిక్ సంచుల లారీ వంతెన పైనుంచి రెయిలింగ్‌ను ఢీకొని కిందకు పడింది. రెండు లారీల ముందు భాగం నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో మొళకాల్మూరు తాలూకా దేవసముద్ర గ్రామానికి చెందిన మంజునాథ్ (35), గాదిలింగప్ప(40), రాయచూరు జిల్లాకు చెందిన ఖలీల్‌బాషా(30), కబీర్(35), రుక్ముద్దీన్(33) మరణించారు. తీవ్ర గాయాలైన సాదిక్‌బాషాను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తళకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ రవికుమార్, అడిషనల్ ఎస్పీ శాంతకుమార్, డీఎస్పీ శేఖరప్ప,సీఐ సమీవుల్లా పరిశీలించారు.
అమావాస్య అంటే భయం.. భయం
ప్రతి నెల అమావాస్య ముందు లేదా వెనుక రోజు తళకు, గిరణిక్రాస్‌ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో జనం వణికిపోతున్నారు. శుక్రవారం మళ్లీ అమావాస్య రోజునే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఈ ప్రాంతంలో ైబె కుల్లో ప్రయాణించేందుకు భయపడుతున్నారు.