పటాన్‌చెరు రూరల్ : ఆగి ఉన్న స్కూల్ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, డ్రైవర్ గాయపడ్డారు. ఈ సం ఘటన మండలం పరిధిలోని ముత్తంగి చౌరస్తా వద్ద సోమవారం చోటు చేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇస్నాపూర్ కు చెందిన త్రివేణి పాఠశాల బస్సు సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో 20 మంది విద్యార్థులను ఇళ్లకు చేర్చేందుకు బయలుదేరింది.
అయితే ముత్తంగి గ్రామంలోకి వెళ్లేందుకు జాతీయ ర హదారిపై యూటర్న్ చేయాల్సి ఉండ గా .. లారీ వస్తుండడంతో వాహనాన్ని ఆపా డు. ఈ సమయంలో వెనుక నుంచి వస్తు న్న ఇసుక లారీ విద్యార్థులున్న బస్సును ఢీకొంది. వెనువెంటనే ఆ స్కూల్ బస్సు ప్రధాన రహదారిలో వెళుతున్న రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో స్కూల్ బస్ డ్రైవర్ జహంగీర్‌కు కాలు విరగ్గా.. బస్సులో ఉన్న పో చారానికి చెందిన విద్యార్థు లు అభిషేక్‌సింగ్, దీక్షిత్‌ల తలలకు గాయాలయ్యాయి.
మిగిలిన విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయపడ్డారు.విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్సలు చే యించారు. కాగా ఈ సమయంలో రోడ్డు పై కిలోమీటర్ వరకు వాహనాలు ఆగిపోవడంతో పోలీసులుట్రాఫిక్‌ను క్లియర్ చేశా రు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఎం ఈఓ ప్రవీణ విద్యార్థుల ఇళ్లకువెళ్లి విద్యార్థుల క్షేమసమాచారాన్ని తెలుసుకున్నారు.
స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
Published Mon, Nov 17 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement