స్కూలు బస్సుల యాజమాన్యాలకు కలెక్టర్ హెచ్చరిక
నిర్లక్ష్యాన్ని సహించబోము
అతివేగం,అజాగ్రత్తతో ప్రమాదాలు
చంద్రశేఖర్‌కాలనీ,న్యూస్‌లైన్:
అతివేగం, అజాగ్రత్త, మద్యం సేవించి వాహనాలను నడపడంతోనే ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని జిల్లా కలెక్టర్ పీ.ఎస్.ప్రద్యుమ్న ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా రవా ణా శాఖ ఆధ్వర్యంలో తిలక్‌గార్డెన్‌లోని న్యూ అం బేద్కర్ భవన్‌లో నిర్వహించిన 25వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. ఇందులో స్కూలు బస్సులు ప్రమాదాలకు గురైతే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నా రు. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా స్కూల్ యాజమాన్యాలు అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
స్కూల్ బస్సుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించిన యా జమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలని కొన్ని నెలల క్రితం ఆదేశాలు జారీ చేసినట్లు తెలి పారు. ఇప్పటి వరకు 80 శాతం కమిటీలు ఏర్పడ్డాయని, మిగితా 20 శాతం స్కూల్స్ కూడా త్వరితగతిన స్కూల్ కమిటీలను ఏర్పాటు చేయాల న్నారు. లేనిపక్షంలో రవాణా శాఖ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యార్థులను తీసుకెళ్లే స్కూల్ బస్సులను కండీషన్‌లో ఉంచాలన్నారు. జిల్లాలో ఇదివరకు రెండు స్కూల్ బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయ ని, ఈ ఘటనల్లో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకపోవడం అదృష్టమన్నారు.
స్కూల్ యాజమాన్యాలు ‘సేవ్’ ధోరణులకంటే ‘సేఫ్’ ఆలోచనలు అలవర్చుకోవాలన్నారు. ప్రమాదా ల నివారణకు అన్ని శాఖల పాత్ర ఉండాలన్నారు. రోడ్లు బాగుండాలని, వేగాన్ని నియంత్రించే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై ప్రమాద సూచి కల బోర్డుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రమాదకరమైన జోన్‌లను గుర్తిస్తున్నామన్నారు. జిల్లా ఉప రవాణా కమిషనర్ రాజారత్నం మాట్లాడుతూ, రహదారి భద్రతా వారోత్సవాలలో ఆటో,లారీ డ్రైవర్లకు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. బోధన్‌లో కంటి పరీక్షలు, నగరంలో విద్యార్థులకు వ్యాసరచన, పేయింటింగ్ పోటీలను నిర్వహించామన్నారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విజేతలకు కార్యక్రమంలో బహుమతులను అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని వాసాచారి, జిల్లా ఉప రవాణా కార్యాలయం ఆర్‌టీవో మక్బుల్, ఎంవీఐ తులసీరాజం, ఏఎంవీఐ సురేశ్ కుమార్‌తోపాటు ఆయా స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు ప్రభాదేవి, కవిత తదితరులు, స్కూల్ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కండీషన్‌లో లేకుంటే కఠిన చర్యలు
Published Tue, Jan 28 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
Advertisement