బైకును ఢీకొన్న లారీ: యువకుడికి గాయాలు | Bike collision, Larry: young Injuries | Sakshi
Sakshi News home page

బైకును ఢీకొన్న లారీ: యువకుడికి గాయాలు

Published Mon, Sep 30 2013 3:42 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

Bike collision, Larry: young Injuries

తాండూరు రూరల్, న్యూస్‌లైన్:ఎదరుగా వస్తున్న లారీ బైకును ఢీకొనడంతో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని చంద్రవంచ గేటు సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. చంద్రవంచ గ్రామానికి చెందిన అఖిలేశ్వర్‌రెడ్డి(20) కర్ణాటక సమీపంలోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడు. ఆదివారం అతడు బైకుపై కరన్‌కోట్ నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. చంద్రవంచ గేటు సమీపంలో ఎదురుగా వస్తు న్న పెన్నా సిమెంట్ కంపెనీకి చెంది న లారీ అతడి బైకును ఢీకొంది. దీంతో కిందపడిపోయిన అఖిలేశ్వర్‌రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికు లు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుం బీకులు అతడిని నగరంలోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement