Published
Fri, Aug 5 2016 8:50 PM
| Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
లారీ ఢీకొని వ్యక్తి మృతి
గుంటూరు ఈస్ట్: లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ద్విచక్రవాహనం పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ ఆర్.సురేష్ బాబు తెలిపిన వివరాలు... గుంటూరు ఆర్ అగ్రహారం 5/5 లో నివసించే మల్లెల సుబ్బయ్య స్టీల్ షాపులో గుమస్తాగా జీవనం సాగిస్తుంటాడు. శుక్రవారం కన్యకాపరమేశ్వరి దేవస్థానం వైపు నుంచి కోనేరు రోడ్డులో నల్ల చెరువు వైపునకు ఇతను ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. నీళ్ల ట్యాంకుల వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న ఏపీఎస్ 7255 లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బయ్య కింద పడిపోగా లారీ చక్రం అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలిసిన అతని భార్య మల్లే కోటేశ్వరి ఇద్దరు చిన్న పిల్లలు, బంధువులు సంఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ట్రాఫిక్‌పోలీసులు మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రై వర్ పఠాన్ బాలీసాహెద్ పరారయ్యాడు.