
వాగులో దిగబడిన బస్సు
కంగ్టి: వాగులో బస్సు దిగబడటంతో నాలుగు గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మంగళవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సు కంగ్టి మండలం చాప్టా(కె) సమీపంలోని వాగులోంచి వెళుతోంది. వంతెన నిర్మాణంలో భాగంగా వాగులోంచే బైపాస్ రోడ్డు వేశారు.
3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులో వరద నీరు ప్రవహిస్తోంది. పైగా గుంతలు ఏర్పడ్డాయి. ఇది గమనించని డ్రైవర్ నడిపిస్తున్న క్రమంలో బస్సు దిగబడిపోయింది. ఆ దారిలో రాకపోకలు స్తంభించాయి. దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులు శ్రమించి బస్సును ఒడ్డుకు చేర్చారు.