విశాఖ పర్యటనలో విషాదం | tadepalligudem man dies in Stream at visakha tour | Sakshi
Sakshi News home page

విశాఖ పర్యటనలో విషాదం

Published Mon, Nov 21 2016 5:25 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

tadepalligudem man dies in Stream at visakha tour

విశాఖపట్టణం: విశాఖ జిల్లా పర్యటనలో విషాదం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంనకు చెందిన 14మంది మినీ బస్సులో సోమవారం విశాఖ జిల్లా డుంబ్రిగూడకు వెళ్లారు. అక్కడ చాపరాయి తదితర ప్రదేశాలను చూసేక్రమంలో బొడబడగెడ్డ వద్ద విశ్రాంతి తీసుకునేందుకు ఆగారు.

అందులోని ముగ్గురు వ్యక్తులు పక్కనే ఉన్న వాగులోకి దిగారు. వారిలో ఎస్.శ్రీనివాసరావు(35) అనే వ్యక్తి కాలు నీటిలోని రాళ్ల మధ్య ఇరుక్కుంది. కాలిని లాక్కునే క్రమంలో అతడు వాగులో కొట్టుకుపోయాడు. తోటి వారు రక్షించేలోగానే చనిపోయాడు. దీంతో మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement