Visakhapatnam tour
-
విశాఖలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అవంతి
-
రేపు విశాఖకు సీఎం జగన్
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం విశాఖ వస్తున్నారు. ఉదయం 7.35 గంటలకు సీఎం నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. 8.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో 9.15 గంటలకు మధురవాడ ఐటీ హిల్‌కు చేరుకుంటారు. 9.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రుషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్‌కు బయలుదేరుతారు. 9.30 గంటల నుంచి 11 గంటల వరకు 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ ప్లీనరీలో (ఐసీఐడీ) పాల్గొంటారు. 11.05 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్ నుంచి బయలు దేరి మధురవాడ హెలిపాడ్‌కు చేరుకుంటారు. 11.35 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. 11.45 గంటలకు విమానంలో తిరుగు పయనమవుతారు. -
విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్న సీఎం.. అనంతరం సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకోనున్నారు. ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు రానున్నారు. అక్కడ ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు. చదవండి: తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా.. రామోజీ ఎందుకిలా? -
సీఎం జగన్ విశాఖ పర్యటన.. షెడ్యూల్ ఇలా..
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో జరగనున్న పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొంటారు. 11వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రి పోర్టు గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 9.40 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 నుంచి 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 12.20కి ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45లకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. చదవండి: ‘చంద్రబాబు హయంలో మాయాబజార్ చూపించారు’ -
విశాఖకు సీఎం జగన్
-
కేంద్ర మంత్రికి ‘ఉక్కు’ నిరసనల సెగ
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఉక్కు’ ఉద్యమ సెగ తగిలింది. 150 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే కేంద్రం కట్టుబడిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు కేంద్ర మంత్రి చేరుకోక ముందు నుంచే ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు. సీఐఎస్ఎఫ్, కేంద్ర బలగాలు కూడా ఎయిర్‌పోర్టు లోపల పహారా కాశాయి. ఎయిర్ పోర్టులోకి వచ్చే వాహనాల్ని తనిఖీ చేసి.. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉద్యమకారులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీస్ బలగాలు వారిని నిరోధించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప పెనుగులాట జరిగింది. నిర్మలా సీతారామన్ గో బ్యాక్, విశాఖ ద్రోహి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ.. విమానాశ్రయ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అప్రమత్తమై వందల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్‌చేసి నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. కొంతమంది ఉద్యమకారులు పోలీస్ వలయాన్ని దాటుకుంటూ.. విమానాశ్రయం లోపలికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కు ఆందోళనకారులు ఎయిర్‌పోర్టు వైపు వస్తున్న తరుణంలో.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బయటికి రావడంతో ఆమె కాన్వాయ్‌ని అడ్డుకోకుండా భద్రతా బలగాలు ఉద్యమకారులను నిలువరించాయి. సీతారామన్ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వెళ్లేంత వరకూ విమానాశ్రయ పరిసర ప్రాంతాలన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆమె బస చేస్తున్న పోర్టు గెస్ట్ హౌస్ వరకూ ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. -
సీఎం విశాఖ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ విశాఖపట్నం పర్యట న రద్దయింది. ఏపీలోని విశాఖపట్నం శారదా పీఠం వార్షికోత్సవాల ముగింపు రోజు (గురువారం) నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రావాలని ఆ పీఠం నుంచి సీఎంకు గతంలో ఆహ్వానం అందింది. ఆయన తొలుత ఈ ఉత్సవాల కు హాజరు కావాలని నిర్ణయించారు. ప్రస్తుతం మం త్రివర్గ విస్తరణ కూర్పు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, లోక్‌సభ ఎన్నికల వ్యూహం సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో సీఎం పర్యటన రద్దయినట్లు తెలి సింది. ఆయన తరఫున ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శారదా పీఠం కార్యక్రమానికి హాజరు కానున్నా రు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభ మయ్యేల్లోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
నేటి జగన్ పర్యటన రద్దు
నేటి జగన్ పర్యటన రద్దు విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నాటి విశాఖ పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. శారదా పీఠంలో జరుగుతున్న వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో జగన్ పర్యటన రద్దు అయినట్లు అమర్నా«థ్ వెల్లడించారు. -
విశాఖ పర్యటనలో విషాదం
విశాఖపట్టణం: విశాఖ జిల్లా పర్యటనలో విషాదం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంనకు చెందిన 14మంది మినీ బస్సులో సోమవారం విశాఖ జిల్లా డుంబ్రిగూడకు వెళ్లారు. అక్కడ చాపరాయి తదితర ప్రదేశాలను చూసేక్రమంలో బొడబడగెడ్డ వద్ద విశ్రాంతి తీసుకునేందుకు ఆగారు. అందులోని ముగ్గురు వ్యక్తులు పక్కనే ఉన్న వాగులోకి దిగారు. వారిలో ఎస్.శ్రీనివాసరావు(35) అనే వ్యక్తి కాలు నీటిలోని రాళ్ల మధ్య ఇరుక్కుంది. కాలిని లాక్కునే క్రమంలో అతడు వాగులో కొట్టుకుపోయాడు. తోటి వారు రక్షించేలోగానే చనిపోయాడు. దీంతో మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.