
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ విశాఖపట్నం పర్యట న రద్దయింది. ఏపీలోని విశాఖపట్నం శారదా పీఠం వార్షికోత్సవాల ముగింపు రోజు (గురువారం) నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రావాలని ఆ పీఠం నుంచి సీఎంకు గతంలో ఆహ్వానం అందింది. ఆయన తొలుత ఈ ఉత్సవాల కు హాజరు కావాలని నిర్ణయించారు. ప్రస్తుతం మం త్రివర్గ విస్తరణ కూర్పు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, లోక్‌సభ ఎన్నికల వ్యూహం సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో సీఎం పర్యటన రద్దయినట్లు తెలి సింది. ఆయన తరఫున ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శారదా పీఠం కార్యక్రమానికి హాజరు కానున్నా రు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభ మయ్యేల్లోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment