sarada pethadhipathi
-
విశాఖలో ఆదిశంకరుల భారీ విగ్రహం
సింహాచలం/అంబాజీపేట: విశాఖలో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా శంకరుల ప్రతిమ ఉంటుందని చెప్పారు. కోనసీమ జిల్లా ముక్కామలలో కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతిని స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం కలిసి వైదిక, ఆధ్యాత్మిక, సంప్రదాయపరమైన అంశాలపై చర్చించారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ వానప్రస్థంలోకి అడుగుపెడుతోన్న వృద్ధ దంపతుల కోసం పురాణ, వేదాంత పరమైన ధర్మ సందేహాల నివృత్తికి ప్రత్యేక కోర్సుని ప్రవేశ పెట్టే ఆలోచన ఉందని, 2– 3 ఏళ్ల నిడివితో కోర్సుని రూపొందించాలని భావిస్తున్నామని విజయేంద్ర సరస్వతి దృష్టికి తీసుకెళ్లారు. స్వరూపానందేంద్ర యోచన పట్ల విజయేంద్ర సరస్వతి హర్షం వ్యక్తం చేశారు. అర్చకత్వం, ఆలయ సంపద పరిరక్షణ తదితర అంశాలపై కూడా ఇరువురూ చర్చించారు. హైందవ ధర్మం పరిరక్షణకు విశాఖ శ్రీశారదాపీఠం చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని విజయేంద్ర సరస్వతి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మం కోసం ధైర్యంగా మాట్లాడే పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి అని ఆయన పేర్కొన్నారు. అనేకసార్లు గురువులు జయేంద్ర సరస్వతితో కలిసి విశాఖ శ్రీశారదాపీఠాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పీఠం నుంచి వెలువడిన అనేక వేదాంత గ్రంథాలను పరిశీలించినట్టు తెలిపారు. అమలాపురం ఎంపీ అనూరాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు యతీంద్రులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ముక్కామలలో నిర్వహించిన బ్రహ్మసత్ర మహోత్సవ ముగింపు కార్యక్రమానికి పీఠాధిపతులు హాజరయ్యారు. పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీఎం విశాఖ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ విశాఖపట్నం పర్యట న రద్దయింది. ఏపీలోని విశాఖపట్నం శారదా పీఠం వార్షికోత్సవాల ముగింపు రోజు (గురువారం) నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రావాలని ఆ పీఠం నుంచి సీఎంకు గతంలో ఆహ్వానం అందింది. ఆయన తొలుత ఈ ఉత్సవాల కు హాజరు కావాలని నిర్ణయించారు. ప్రస్తుతం మం త్రివర్గ విస్తరణ కూర్పు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, లోక్‌సభ ఎన్నికల వ్యూహం సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో సీఎం పర్యటన రద్దయినట్లు తెలి సింది. ఆయన తరఫున ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శారదా పీఠం కార్యక్రమానికి హాజరు కానున్నా రు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభ మయ్యేల్లోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
'ఈ ఏడాది వర్షాలు తక్కువ... ఎండలు ఎక్కువ'
విశాఖపట్నం: సెక్యూలర్ పేరుతో హిందూ శాస్త్రాలు మోసానికి గురవుతున్నాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. ఈ 14 నుంచి 18 వరకు పెందుర్తి శారదాపీఠంలో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని.. ఎండలు కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉందని పీఠాధిపతి అభిప్రాయపడ్డారు. భూకంపాలు, అగ్రి ప్రమాదాలు సంభవించడానికి ఆస్కారం ఉందన్నారు. దేవాలయాల సనాతన సాంప్రదాయాన్ని, శాస్త్రాలను అమలు పరచడానికి ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు చేతుల మీదుగా 17న వేద పండితులకు సత్కారం, సువర్ణ కంకర ధారణ కార్యక్రమం నిర్వహిస్తామని స్వరూపానందేంద్ర వెల్లడించారు.