'ఈ ఏడాది వర్షాలు తక్కువ... ఎండలు ఎక్కువ'
విశాఖపట్నం: సెక్యూలర్ పేరుతో హిందూ శాస్త్రాలు మోసానికి గురవుతున్నాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. ఈ 14 నుంచి 18 వరకు పెందుర్తి శారదాపీఠంలో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని.. ఎండలు కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉందని పీఠాధిపతి అభిప్రాయపడ్డారు.
భూకంపాలు, అగ్రి ప్రమాదాలు సంభవించడానికి ఆస్కారం ఉందన్నారు. దేవాలయాల సనాతన సాంప్రదాయాన్ని, శాస్త్రాలను అమలు పరచడానికి ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు చేతుల మీదుగా 17న వేద పండితులకు సత్కారం, సువర్ణ కంకర ధారణ కార్యక్రమం నిర్వహిస్తామని స్వరూపానందేంద్ర వెల్లడించారు.