Chinni Trailer: Keerthy Suresh As Killer In Chinni Movie And Trailer Released - Sakshi
Sakshi News home page

Keerthy Suresh Movie Trailer: కానిస్టేబుల్‌గా కీర్తి సురేష్‌.. 24 హత్యలు.. ఆసక్తిగా 'చిన్ని' ట్రైలర్‌

Published Wed, Apr 27 2022 8:52 AM | Last Updated on Wed, Apr 27 2022 12:02 PM

Keerthy Suresh As Killer In Chinni Movie And Trailer Released - Sakshi

మహానటి' కీర్తి సురేష్‌ తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఇందులో సూపర్‌ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్.

Keerthy Suresh As Killer In Chinni Movie And Trailer Released: 'మహానటి' కీర్తి సురేష్‌ తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఇందులో సూపర్‌ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. 'సాని కాయిధం' అనే తమిళ చిత్రాన్ని 'చిన్ని' పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇందులో కీర్తి సురేష్‌ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్‌డ్‌ పాత్రలో అలరించనుంది. ఈ మూవీలో ధనుష్‌ సోదరుడు, డైరెక్టర్‌ సెల్వ రాఘవన్‌ కీలక పాత్ర పోషించాడు. 

ఇది వరకు రిలీజైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఎన్ని మర్డర్‌లు చేశావని' రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు అడగడంతో మూవీ ట్రైలర్‌ ప్రారంభమైంది. కీర్తి సురేష్, సెల్వ రాఘవన్‌ తాము చేసిన హత్యల గురించి చెప్పే పద్ధతి ఉత్కంఠంగా ఉంది. వీరిద్దరి యాక్టింగ్‌ సూపర్బ్‌ అనేలా ఉంది.



24 మందిని చంపి తాను చేయబోయే 25వ హత్య గురించి చెప్పడం క్రూరంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ పగ, ప్రతికారం, క్రైమ్‌ నేపథ్యంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్‌గా పని చేసిన చిన్ని ఎందుకు ఇన్ని హత్యలు చేయాల్సి వచ్చిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వ వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో మే 6 నుంచి ప్రసారం కానుంది.

చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్‌ సిగ్నల్‌

'కళావతి సాంగ్​'పై కళావతి స్టెప్పులు.. నెట్టింట వైరల్​




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement