Keerthi Suresh Reveals Shocking Facts About Her Movie Career Early Days - Sakshi
Sakshi News home page

Keerthi Suresh: 'అలా జరగడంతో నన్ను ఐరన్‌ లెగ్‌ అన్నారు'.. హీరోయిన్‌ ఆవేదన

Published Sat, Jan 29 2022 3:33 PM | Last Updated on Sat, Jan 29 2022 5:52 PM

Keerthi Suresh Reveals About Her Struggles At Her Movie Career Early Days - Sakshi

Keerthi Suresh Reveals About Her Struggles At Her Movie Career Early Days: టాలీవుడ్‌, ​కోలీవుడ్‌ల్లో టాప్‌ హీరోయిన్లలో కీర్తి సురేష్‌ కూడా ఒకరు. ప్రస్తుతం స్టార్‌ హీరోలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. అయితే కెరీర్‌ ఆరంభంలో తాను కూడా అవమానాలు ఎదుర్కొన్నాని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్‌ ఈ విషయాలను ప్రస్తావించింది. 'హీరోయిన్‌గా నా కెరీర్‌ మలయాళ చిత్ర పరిశ్రమతో మొదలైంది.

నా ఫస్ట్‌ మూవీ సెట్స్‌ మీదకి వెళ్లిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. రెండవ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో నాది ఐరన్‌ లెగ్‌ అని ప్రచారం చేశారు. తర్వాత కొన్ని అవకాశాలు కూడా చేజారాయి. ఇలా అవమానాలు ఎదుర్కొన్నా. అయినా ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లా. నా పనితీరే నాకు విజయాన్ని అందించింది.

సక్సెస్‌ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని నేను భావించాను' అంటూ చెప్పుకొచ్చింది.ఇటీవలె గుడ్‌లక్‌ సఖితో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో మహేశ్‌బాబుతో సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్‌ చిత్రాలు చేస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement