సాహసం... వినోదం! | viram ahanush's movie marakatamani movie | Sakshi
Sakshi News home page

సాహసం... వినోదం!

Published Thu, Mar 2 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

సాహసం... వినోదం!

సాహసం... వినోదం!

‘వైరం’ ధనుష్‌ గుర్తుండే ఉంటాడు. హీరోకి ధీటైన విలన్‌ అని ‘సరైనోడు’ చిత్రంలో ఆ పాత్రలో ఆది పినిశెట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. హీరోగా చేస్తున్నప్పటికీ వైవిధ్యమైన పాత్రల పట్ల మక్కువ ఉండటంతో ఆది ఈ విలన్‌ పాత్ర చేశారు. ఇప్పుడు ‘మరకతమణి’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి , నిక్కి గర్లాని జంటగా రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌.కె శర్వనణ్‌ దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఫస్ట్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అడ్వెంచరస్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెలలోనే రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘కబాలి’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌ అసిస్టెంట్‌ దిబు థామస్‌ పాటలు స్వరపరిచారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం మంచి పాత్రలు చేశారు’’ అని రిషి మీడియా–శ్రీ చక్ర ఇన్నోవేషన్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement