
తమిళసినిమా: నటుడు ఆది పినిశెట్టి నటి నిక్కి గల్రాణి జంటగా నటించిన చిత్రం మరకత నాణయం. ఈ చిత్రం ద్వారా ఏఆర్కే శరవణ్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. 2017లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. నటుడు ఆది పినిశెట్టి కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోయింది. దర్శకుడు ఏ ఆర్ కె .శరవణ్ కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా ఈయన సుమారు ఐదేళ్ల తర్వాత ఇటీవల హిప్ హాప్ తమిళా ఆది హీరోగా వీరన్ అనే సోషియో ఫాంటసీ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
అంతే కాకుండా ఓటిటిలోనూ వీక్షకుల విశేష ఆదరణతో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ప్రస్తుతం దర్శకుడు ఏ ఆర్ కె శరవణ్ తన తాజా చిత్రాల పనిలో చాలా బిజీగా ఉన్నారు. దీని గురించి ఆయన పేర్కొంటూ తన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించటం సంతోషంగా ఉందన్నారు. వీరన్ చిత్రం తర్వాత పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.
2023– 24 లో తాను చాలా బిజీగా ఉంటానని చెప్పారు. ముఖ్యంగా ఇంతకుముందు ఆది పినిశెట్టి, నిక్కి గల్రాణి జంటగా తాను దర్శకత్వం వహించిన మరకత నాణయం చిత్రానికి సీక్వెల్ కు దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు. ఇందులోనూ అదే జంట నటిస్తారని తెలిపారు. ఆ తర్వాత విష్ణు విశాల్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు దీన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుందని తెలిపారు. ఇది ఫాంటసీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు ఏఆర్కే శరవణ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment