ప్రియుడితో పెళ్లి తర్వాత హీరోయిన్ హన్సిక మోత్వానీ నటిస్తోన్న చిత్రం 'పార్ట్‌నర్'. తమిళంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
(ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!)
అయితే ఈవెంట్‌లో నటుడు రోబో శంకర్ వివాదస్పద కామెంట్స్ చేశారు. హన్సిక మోత్వానీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ మూవీ షూటింగ్‌లో హన్సిక తన కాలును తాకేందుకు నిరాకరించిందని ఆరోపించారు. దర్శకుడు ఆమెను ఎంత బతిమాలిని ఒప్పుకోలేదని.. ఆమె తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి.
దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్‌పై ఈవెంట్‌కు హాజరైన మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. రోబో శంకర్‌కు మర్యాద, వృత్తి నైపుణ్యం లేవంటూ ఓ మహిళ జర్నలిస్ట్ ఆయన ప్రవర్తనను తప్పబట్టారు. అయితే రోబో శంకర్ ఆరోగ్యం బాగోలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి జాండిస్ నిర్ధారణ అయిందని.. అందుకోసం చికిత్స పొందుతున్నాడని రోబో శంకర్ భార్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మానసికి పరిస్థితి బాగాలేదని ఆమె అన్నారు.
(ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్! )
Comments
Please login to add a commentAdd a comment