స్మశానంలో షూటింగ్‌.. హన్సిక హారర్‌ మూవీ రిలీజ్‌ | Hansika Motwani Horror Movie Guardian Released | Sakshi
Sakshi News home page

Hansika Motwani: అర్ధరాత్రి స్మశానంలో షూటింగ్‌.. నన్ను చూసి నేనే భయపడ్డా

Published Sat, Mar 9 2024 2:03 PM | Last Updated on Sat, Mar 9 2024 2:55 PM

Hansika Motwani Horror Movie Guardian Released - Sakshi

వివాహానంతరం కథానాయకిగా బిజీగా ఉన్న కొద్దిమంది నటీమణుల్లో హన్సిక ఒకరు. ఈ బహుభాషా నటి యాక్ట్‌ చేసిన చిత్రాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. అలా తాజాగా హన్సిక నటించిన చిత్రం గార్డియన్‌. హారర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్‌ పతాకంపై విజయ్‌చందర్‌ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్‌ దర్శకత్వం వహించారు.

శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, కేఏ.శక్తివేల్‌ చాయాగ్రహణం అందించారు. ఈ మూవీ శుక్రవారం (మార్చి 8న) తెరపైకి వచ్చింది. అరణ్మణై 1, 2 చిత్రాల తరువాత హన్సిక నటించిన హారర్‌ మూవీ ఇది. హన్సిక తన అనుభవం గురించి మాట్లాడుతూ.. గార్డియన్‌ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. ఈ చిత్రంలో దెయ్యం పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటించినట్లు చెప్పింది. ఈ పాత్ర గెటప్‌ ప్రత్యేకంగా ఉంటుందని తెలిపింది. ఇందుకోసం స్పెషల్‌ లెన్స్‌ పెట్టినట్లు వెల్లడించింది.

చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్మశానంలో అర్ధరాత్రి 12 గంటలకు చిత్రీకరించారని, అదీ తలకిందులుగా వేలాడుతూ దెయ్యంగా అరిచే సన్నివేశాల్లో నటించడం సవాలుగా మారిందని తెలిపింది ఆ సమయంలో దెయ్యం గెటప్‌లో ఉన్న తనను చూసి తానే భయపడ్డానని హన్సిక చెప్పుకొచ్చింది. వివాహానంతరం నటించడంలో తనకెలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని హన్సిక పేర్కొన్నారు. తన తల్లి, భర్త చాలా మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. తర్వాత తాను నటిస్తున్న గాంధారి, ది మెన్‌ చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement