భయపెట్టేందుకు రెడీగా ఉన్న గ్లామర్‌ బ్యూటీ | Hansika Motwani Guardian Movie Ready To Release | Sakshi
Sakshi News home page

Hansika Motwani: భయపెట్టేందుకు రెడీగా ఉన్న గ్లామర్‌ బ్యూటీ

Published Mon, Nov 6 2023 6:44 AM | Last Updated on Mon, Nov 6 2023 6:44 AM

Hansika Motwani Guardian Movie Ready To Release - Sakshi

ఇప్పటివరకు హీరోలకే పెళ్లి, వయసుతో పనిలేదు అనుకొనే వాళ్లం. ఇప్పుడు హీరోయిన్లూ ఆ కోవలోకి చేరిపోతున్నారు. పెళ్లయితే గ్లామర్‌ పోతుంది, హీరోయిన్‌ అవకాశాలు రావు అనే కాలం పోయింది. పిల్లలకు తల్లిలు అయిన తర్వాత కూడా ఈ కాలం నటీమణులు హీరోయిన్లుగా నటిస్తూనే ఉన్నారు. నటి కాజల్‌ అగర్వాల్‌, నయనతార వంటి వాళ్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇక మరో అందాల తార హన్సిక గురించి చెప్పాలంటే ఇటీవలే పెళ్లి చేసుకున్నా అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటోంది. నటిగా ఈమె వయసు 20 ఏళ్లు.

2003లో దేశముదురు అనే తెలుగు చిత్రంతో దక్షిణాదిలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తూ నేటికీ బిజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ఇటీవలే నటిగా అర్ధ సెంచరీ కొట్టిన హన్సిక హీరోయిన్‌గా ఇంకా పరుగులు తీస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో నాలుగు ఐదు చిత్రాలు ఈ భామ చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో గార్డియన్‌ అనే హారర్ర్‌ చిత్రంలో దెయ్యంగా భయపెట్టోందుకు సిద్ధమవుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రం కావడం గమనార్హం. దర్శకుడు విజయ్‌ చందర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

కాగా ఇప్పటివరకు హన్సికలోని గ్లామర్‌ను చూసిన ప్రేక్షకులకు ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఈ గార్డియన్‌ రాబోతుంది. నటుడు సురేష్‌ మీనన్‌, శ్రీమాన్‌, మొట్టై రాజేంద్రన్‌, ప్రదీప్‌ రాయన్‌, తంగదురై ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శబరి, గురుశరవణన్‌ ద్వయం దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నవంబర్‌ 30న తమళ్‌,తెలుగు భాషలలో గార్డియన్‌ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement