sriman
-
భయపెట్టేందుకు రెడీగా ఉన్న గ్లామర్ బ్యూటీ
ఇప్పటివరకు హీరోలకే పెళ్లి, వయసుతో పనిలేదు అనుకొనే వాళ్లం. ఇప్పుడు హీరోయిన్లూ ఆ కోవలోకి చేరిపోతున్నారు. పెళ్లయితే గ్లామర్ పోతుంది, హీరోయిన్ అవకాశాలు రావు అనే కాలం పోయింది. పిల్లలకు తల్లిలు అయిన తర్వాత కూడా ఈ కాలం నటీమణులు హీరోయిన్లుగా నటిస్తూనే ఉన్నారు. నటి కాజల్ అగర్వాల్, నయనతార వంటి వాళ్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇక మరో అందాల తార హన్సిక గురించి చెప్పాలంటే ఇటీవలే పెళ్లి చేసుకున్నా అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటోంది. నటిగా ఈమె వయసు 20 ఏళ్లు. 2003లో దేశముదురు అనే తెలుగు చిత్రంతో దక్షిణాదిలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తూ నేటికీ బిజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ఇటీవలే నటిగా అర్ధ సెంచరీ కొట్టిన హన్సిక హీరోయిన్గా ఇంకా పరుగులు తీస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో నాలుగు ఐదు చిత్రాలు ఈ భామ చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో గార్డియన్ అనే హారర్ర్ చిత్రంలో దెయ్యంగా భయపెట్టోందుకు సిద్ధమవుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం కావడం గమనార్హం. దర్శకుడు విజయ్ చందర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఇప్పటివరకు హన్సికలోని గ్లామర్‌ను చూసిన ప్రేక్షకులకు ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఈ గార్డియన్ రాబోతుంది. నటుడు సురేష్ మీనన్, శ్రీమాన్, మొట్టై రాజేంద్రన్, ప్రదీప్ రాయన్, తంగదురై ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శబరి, గురుశరవణన్ ద్వయం దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నవంబర్ 30న తమళ్,తెలుగు భాషలలో గార్డియన్ చిత్రం విడుదల కానుంది. -
చదువు గొప్పదనం నేపథ్యంలో...
‘‘రాక్షస కావ్యం’ బడ్జెట్ పరంగా చిన్న సినిమా. కానీ, కథ పరంగా పెద్ద సినిమా. పురాణాల్లోని జయవిజయ పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని, కలియుగంలో వారు జన్మిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహతో ‘రాక్షస కావ్యం’ తీశా’’ అని డైరెక్టర్ శ్రీమాన్ కీర్తీ అన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో దామురెడ్డి మాట్లాడుతూ–‘‘ఇదొక వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రం. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలతో పాటు చదువు గొప్పదనాన్ని చెబుతున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల వేసిన ప్రీమియర్స్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు అభయ్ నవీన్. నటీనటులు కుశాలిని, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు, అన్వేష్ మైఖేల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధరా దేవి, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఉమేష్ చిక్కు. -
‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
శాన్వీ మేఘన, కౌశిక్ బాబు జంటగా శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే సరోజ: ఉరఫ్ కారం చాయ్’. గాళ్స్ సేవ్ గాళ్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఎస్ 3 క్రియేషన్స్ పతాకంపై రచయిత డా. సదానంద్ శారద నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన శాసన సభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్‌ఫుల్‌గా నటించారు.ఓ సామాజిక అంశాన్ని తీసుకుని ఈ తరహా సినిమాను నిర్మించిన దర్శక–నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఆడపిల్ల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్ష చూపించేవారికి తాగిస్తాం కారం చాయ్ అంటూ గుణపాఠం చెప్పేలా సరోజ పాత్ర ఉంటుంది. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు శ్రీమాన్ గుమ్మడవెల్లి. ‘‘ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి వీరోచిత పోరాటాలు, ఆర్. ఎస్. నంద హాస్యం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అన్నారు రచయిత, నిర్మాత సదానంద్ శారద. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదాద్రిలోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్రీమాన్, శ్రీవాణి అనే వారు ఆదివారం స్థానిక ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. సోమవారం ఉదయం వారిద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండగా నిర్వాహకులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు తేలింది. చికిత్స అనంతరం శ్రీమాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగు కాగా, శ్రీవాణి పరిస్థితి విషమించటంతో ఇద్దరినీ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.