రెండోసారి | Aadhi Pinisetty and Taapsee to team up | Sakshi
Sakshi News home page

రెండోసారి

Published Mon, Dec 4 2017 1:43 AM | Last Updated on Mon, Dec 4 2017 1:43 AM

Aadhi Pinisetty and Taapsee to team up - Sakshi

‘గుండెల్లో గోదారి’ చిత్రంలో అలరించిన ఆది పినిశెట్టి–తాప్సీ మరోసారి జోడీ కడుతున్నారు. ‘లవర్స్‌’ ఫేమ్‌ హరి దర్శకత్వంలో కోన వెంకట్‌ సమర్పణలో ‘గీతాంజలి‘ చిత్రనిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. విభిన్నమైన కథతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రారంభం కానుంది.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో తాప్సీతో పాటు మరో ప్రముఖ కథానాయిక నటించనున్నారు. ‘సరైనోడు, నిన్ను కోరి’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆది ప్రస్తుతం ‘రంగస్థలం, అజ్ఞాతవాసి’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు మంచి పాత్రల్లో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగానూ నటిస్తున్నారాయన. ‘వెన్నెల’ కిశోర్, శివాజీరాజా, తులసి, సాయిచంద్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కెమెరా: తోట రాజు (‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌), సంగీతం: గోపీసుందర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement